SairaBanu | ఆది సాయికుమార్ ‘సైరాబాను’ గ్రాండ్ లాంచ్.. క్లాప్ కొట్టిన కిరణ్ అబ్బవరం!
Aadi Saikumar | టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ సరికొత్త లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
Aadi Saikumar | టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ సరికొత్త లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. అన్ని హద్దులను చెరిపేసే ఒక అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘సైరాబాను’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. ఈ ప్రాజెక్ట్ నేడు అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ముహూర్తపు సన్నివేశానికి యంగ్ హీరో కిరణ్ అబ్బవరం క్లాప్ కొట్టగా, ప్రముఖ దర్శకుడు రామ్ అబ్బరాజు మరియు సీనియర్ నటుడు సాయికుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ మరియు జైన్స్ నాని చిత్ర స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేశారు. ఇక ఈ మొదటి షాట్‌కు దర్శకుడు యోగి దర్శకత్వం వహించారు.
హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కృష్ణకాంత్ పరుచూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫణి క్రిష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాంధవి శ్రీధర్ కథానాయికగా నటిస్తోంది. శేఖర్ చంద్ర సంగీతాన్ని అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా మరియు ఛోటా కె. ప్రసాద్ ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
A formal beginning…
to a love story that breaks every boundary ❤️#SairaBanu Pooja Ceremony commenced today✨Clap by @Kiran_Abbavaram
Camera switch on by @RamAbbaraju @saikumaractor garu
Script handover by @konavenkat99 @JainsNani
First shot direction @filmsyogiShoot… pic.twitter.com/Dd9puJhW9d
— Hasya Movies (@HasyaMovies) April 3, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

