‘సింగం’ సిరీస్ చిత్రాలకు బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. అజయ్‌దేవ్‌గణ్ హీరోగా రోహిత్‌శెట్టి దర్శకత్వంలో రూపొందిన సింగం, సింగం రిటర్స్న్ చిత్రాలు పవర్ఫుల్ పోలీస్ కథాంశాలతో ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఈ కాప్ యూనివర్స్ సిరీస్‌ను కొనసాగిస్తూ దర్శకుడు రోహిత్‌శెట్టి ‘సింగం ఎగైన్’ పేరుతో మూడో భాగాన్ని రూపొందించబోతున్నాడు. ఇందులో అజయ్‌దేవ్‌గణ్ సరసన అగ్ర కథానాయిక దీపికాపడుకోన్ నటించనుంది.
ఈ విషయాన్ని దర్శకుడు రోహిత్‌శెట్టి సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. దీపికాపడుకోన్తో కలిసి తీయించుకున్న ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ మూడో సిరీస్‌లో దీపికాపడుకోన్ పోలీసాఫీర్ పాత్రలో కనిపించనుందని, లేడీ సింగంగా ఆమె పాత్ర అత్యంత శక్తివంతంగా సాగుతుందని పేర్కొన్నారు. అజయ్‌దేవ్‌గణ్-దీపికాపడుకోన్ కాంబినేషన్లో రాబోతున్న తొలి చిత్రమిదే కావడం విశేషం. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.