రోహిత్, మేఘన రాజ్‌పుత్ జంటగా నటించిన థ్రిల్లర్ మూవీ ‘మిస్టీరియస్’. మహి కోమటిరెడ్డి దర్శకుడు. జయ్ పల్లందాస్ నిర్మాత. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
కొత్త కథనంతో సస్పెన్స్‌తో సాగే థ్రిల్లర్ ఇదని దర్శకుడు మహి కోమటిరెడ్డి తెలిపారు. ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా 150 థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ఇంకా చిత్రబృందం కూడా మాట్లాడారు.