Rohini | తమిళ నటీమణులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన చెన్నైకి చెందిన డాక్టర్ కాంతరాజ్‌పై తమిళ నటీనటులు అసోసియేషన్ నడిగర్ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆయనపై చెన్నై సిటీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు సీనియర్ నటి రోహిణి పేర్కొంది. నడిగర్ సంఘంలోని కీలకమైన అంతర్గత విచారణ కమిటీకి రోహిణి నేతృత్వం వహిస్తున్నారు.
ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ కాంతరాజ్ తమిళ కథానాయికలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవకాశాల కోసం కథానాయికలు అన్నింటికి సర్దుకుపోతారని అన్నారు. ఆయన మాటలపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి.
ఆయన వ్యాఖ్యలు సినీరంగంలో పనిచేస్తున్న మహిళల మానసికైస్థెర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, వారి ప్రతిష్టకు భంగ కలిగిస్తాయని రోహిణి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేసింది. ఆయన ఇంటర్వ్యూ వీడియోను తొలగించాలని యూట్యూబ్ సంస్థకు లేఖ రాస్తున్నట్లు ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఈ వివాదం తమిళ సినీరంగంలో చర్చనీయాంశంగా మారింది.