Bigg Boss Telugu 8 – Rohini | బుల్లితెర ప్రేక్షకుల ఫేవరేట్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 14 వారాలుగా అలరిస్తున్న ఈ షో మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఈ షోకి సంబంధించి ఆదివారం వస్తుందంటే చాలు ప్రేక్షకులు టెన్షన్‌తో టీవీలకు అతుక్కుపోతారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే హౌజ్ నుంచి బేబక్కతో పాటు, శేఖర్ బాషా, అభయ్, సోనియా ఆకుల, గంగవ్వ, హరితేజ, నవీన్, టేస్టీ తేజ, పృథ్వి శెట్టి ఎలిమినేట్ అవ్వగా.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా.. టాప్ 5 లో నిలుస్తుందని భావించిన స్టాంగ్ కంటెస్టెంట్ రోహిణి శనివారం హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. వాస్తవానికి 14వ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందని అంతా భావించారు. బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలే బరిలో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉంటారు అనుకున్నారు. కానీ ఎవరు ఉహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ నిర్వహించారు.
ఈ వారం నామినేషన్స్‌లో గౌతమ్, విష్ణుప్రియ, నబీల్, నిఖిల్, ప్రేరణ, రోహిణి ఉండగా.. బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారం చూస్తే.. డేంజర్ జోన్లో రోహిణి, విష్ణుప్రియలు ఉన్నారు. ఈ క్రమంలో మొదటి ఎలిమినేషన్‌గా రోహిణి ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ నుంచి అవుట్ అయింది. ఇక డేంజర్ జోన్లో ఉన్న రెండో కంటెస్టెంట్ విష్ణుప్రియ ఈరోజు ఎలిమినేట్ అవ్వనున్నట్లు తెలుస్తుంది. కానీ మరోవైపు ప్రేరణతో పాటు నబీల్ కూడా డేంజర్ జోన్లో ఉన్నట్లు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన రోహిణి ఎనిమిది వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగింది. దీంతో ఆమెకు వారానికి రూ.4లక్షల చొప్పున 8 వారాలకు రూ.32 లక్షలు అందించినట్లు సమాచారం.