Rocky aur Rani ki prem kahani Trailer | ఖాన్లు, కపూర్లు బాలీవుడ్‌ను ఏలుతున్న టైమ్‌లో రణ్వీర్ సింగ్ వాళ్లకు పోటీగా వచ్చి వాళ్ల సినిమాలకు ధీటుగా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టాడు. పుష్కర కాలం క్రితం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రణ్వీర్ ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఆయన రెమ్యునరేషన్ సైతం ఖాన్ల స్థాయిలో ఉండటం గమనార్హం. రామ్‌లీలా, భాజీరావ్ మస్తానీ, పద్మావత్, సింబా, గల్లీ భాయ్ ఇలా బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లతో బాలీవుడ్లో రణ్వీర్ క్రేజ్ శిఖరాలను అందుకుంది. కాగా గత రెండు, మూడేళ్లుగా రణ్వీర్ సింగ్‌కు అస్సలు కలిసి రావడం లేదు. విభిన్న జానర్లో సినిమాలు ట్రై చేస్తున్నా ప్రేక్షకులు తిప్పికొడుతున్నారు.
ప్రస్తుతం ఆయన ఆశలన్నీ ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని’ సినిమాపైనే ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ హిందీ ప్రేక్షకుల్లో మాములు బజ్ క్రియేట్ చేయలేదు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు కరణ్ జోహర్ దర్శకత్వం వహించాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత కరణ్ ఈ సినిమాతో మెగాఫోన్ పట్టాడు. జూలై 28న విడుదల కాబోతున్న ఈ సినిమాపై మంచి బజ్ పెంచేందుకు మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లను ప్రకటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదలైంది.
కారు యాక్సిడెంట్ గొడవతో మొదలైన రణ్వీర్, ఆలియాల ప్రయాణం స్నేహంగా మారి ఆ తర్వాత ప్రేమ, పెళ్లి వరకు దారి తీస్తుంది. అయితే వీళ్ల పెళ్లి జరగాలంటే మాత్రం మూడు నెలల పాటు తమ కుటుంబాలను మార్చుకోవాలని వీరిద్దరూ నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో అలియా ఇంటికి రణ్వీర్ సింగ్, రణ్వీర్ ఇంటికి ఆలియా వెళ్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగింది. చివరికి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా అనే నేపథ్యంలో సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. రెండు ఫ్యామిలీలో వీళ్లద్దరూ చేసే రచ్చ మామాలుగా ఉండదు అన్నట్లు ట్రైలర్లో చూపించారు. ట్రైలర్ మొత్తం అవుట్ అండ్ అవుట్ కామెడీతో నిండిపోయింది.
కరణ్ తన స్టైల్ ఆఫ్ కామెడీని, ఎమోషన్స్‌ను సినిమాలో పుష్కలంగా దట్టించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. కుటుంబ కథా నేపథ్యంలో మంచి ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో ఈ స్థాయిలో నవ్వించే ట్రైలర్ మాత్రం రాలేదు. ట్రైలర్ లాగే సినిమా కూడా అవుట్ అండ్ హిలేరియస్‌గా ఉంటే మాత్రం బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం మాత్రం కురవడం ఖాయం. ధర్మేంద్రా, జయా బచ్చన్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. కరణ్ జోహార్ ఇండస్ట్రీలోకి వచ్చి పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు. వయాకామ్18 స్టూడీయోస్‌తో కలిసి ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ ఈ సినిమాను నిర్మించాడు.