Rocking Rakesh-Sujatha | బుల్లి తెరపై ఎంతో ప్రజాదరణ పొందిన షో జబర్దస్త్. ఈ కార్యక్రమం ద్వారా పాపులర్ అయిన జంటలలో రాకింగ్ రాకేష్ – సుజాత జోడీ ఒకటి. వీళ్ల కామెడీ టైమింగ్, స్కిట్లలో ఉండే సరదా పంచులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇక వీరి మధ్య కెమిస్ట్రీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. రాకేష్ యాక్టింగ్‌తో పాటు డైలాగ్ డెలివరీలోనూ మంచి పట్టు చూపిస్తుంటే, సుజాత తన హావభావాలతో, సహజ నటనతో స్కిట్‌కు జీవం పోసేది. అయితే జబర్దస్త్‌లో కామెడీ చేస్తూ నవ్వించే రాకేష్ ఇంట్లో చాలా సీరియస్‌గా ఉంటాడని ఆమె తల్లి ఓ సందర్భంలో తెలిపారు. పెద్దకొడుకు అవ్వడం వల్ల తాము కూడా అతడికి గౌరవం ఇస్తామని.. రాకేష్ ఇంటికి వస్తే అంతా సైలెంట్ అయిపోతారని తల్లి జయలక్ష్మి వెల్లడించారు. కానీ, ఇప్పుడు మనవరాలు, కోడలు రావడం వల్ల ఇంట్లో సందడిగా ఉంటోందని అన్నారు.
రాకేష్-సుజాతలు 2023 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. రాకేష్-సుజాత జంట సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. వారి పెళ్లి, సుజాత ప్రగ్నెంట్, సీమంతం ఫొటోలు అన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. తాను తండ్రి అయిన సమయంలో హాస్పిటల్ నుంచి సుజాత, పాప ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసారు జబర్దస్త్ రాకేష్. నవరాత్రి పర్వదినాలలో మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అని తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది అంటూ రాసుకొచ్చారు. అయితే ఇన్నాళ్లు తమ కూతురి ఫేస్ రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డ ఈ జంట నేడు ఫాదర్స్ డే సందర్భంగా తమ కూతుర్ని మొదటి సారి చూపిస్తున్నాం అంటూ జబర్దస్త్ రాకింగ్ రాకేష్ – సుజాత పలు ఫోటోలు షేర్ చేసారు. ఈ క్యూట్ ఫ్యామిలీ ఫోటోలు వైరల్ గా మారాయి.
రాకింగ్ రాకేష్ తన స్కిట్స్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. పలు సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు చేశాడు. అలాగే పలు టీవీ షోలు కూడా చేస్తున్నాడు రాకేష్. ఇక సుజాత కెరీర్ బిగినింగ్‌లో న్యూస్ ప్రజెంటర్ గా చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ లో పాల్గొంది. బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది సుజాత. ఇక ఈ జంట లవ్లీ కపుల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.