Vijay Devarakonda | రౌడి స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించాడు. దీని తర్వాత ఇదే కాంబోలో జనగణమన చిత్రం తెరకెక్కనుందని ఇదివరకే ప్రకటన వచ్చింది. విజయ్ లైగర్ చిత్రం తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. కానీ పూరీ మధ్యలోకి వచ్చాడు. లైగర్ సమయంలోనే పూరీ ‘జనగణమన’ కథను విజయ్ చెప్పడంతో వెంటనే ఈ సినిమా చేద్దాం అని ఇద్దరూ భావించారట. దాంతో శివ నిర్వాణ చిత్రం వెనకకు జరిగింది.
శివనిర్వాణ తెరకెక్కిస్తున్న చిత్రంలో సమంత హీరోయిన్గా నటించనుందిఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పలువురు పేర్లు అనుకున్న చివరికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచంద్రన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. తెలుగులో అనిరుధ్‌కు ఈ చిత్రం మూడవది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ‘లైగర్’ ముంబై వీధుల్లోని ఓ చాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదిగాడు అనే కథాంశంతో తెరకెక్కింది.