Robinhood OTT | యూత్ స్టార్ నితిన్ , గ్లామరస్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన చిత్రం రాబిన్ హుడ్ కొద్ది రోజుల క్రితం థియేటర్స్‌లో విడుదలై డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమాలో ఆ స్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా నటించడంతో రిలీజ్ ముందు రోజు నుండే సినిమాపై బజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాకి ఛలో, భీష్మ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న వెంకీ కుడుమల దర్శకత్వం వహించడంతో మూవీ హిట్ అని అందరు అనుకున్నారు. ఇందులో క్రేజీ హీరోయిన్ కేతిక శర్మ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించడం, అది కాస్తా వివాదాస్పదం కావడం..ఇలా రిలీజ్ కు ముందే రాబిన్ హుడ్ సినిమా వార్తలలో నిలిచింది.
మార్చి 28న ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేశారు. భీష్మ రేంజ్ లో ఈ చిత్రం విజయం అందుకోలేకపోయింది కానీ మోస్తరు ఎంటర్టైన్మెంట్ ని మాత్రం అందించింది. ఇటీవల ఈ చిత్రం ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.ఈ చిత్రం ఓటిటి హక్కులు జీ5 సంస్థ కొనుగోలు చేయగా, మే 10 నుండి ప్రముఖ ఓటీటీ ‘జీ5’లో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అదే రోజున ‘జీ తెలుగు’ ఛానల్లోనూ ప్రీమియర్ అయ్యింది. అయితే థియేటర్లో మూవీకి అంత రెస్పాన్స్ రాకపోయిన ఓటీటీలో మాత్రం అదరగొడుతుంది. ఓటీటీలో రిలీజ్ అయినప్పటి నుంచీ ‘రాబిన్ హుడ్’ మూవీ రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది.
యాక్షన్, ఎంటర్టైన్మెంట్తో ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ యూత్ ఆడియన్స్‌కి దగ్గరైన ఈ చిత్రం ఇప్పటివరకూ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సదరు ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఇలాంటి రికార్డ్ సాధించడం పట్ల నితిన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. మూవీలో సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, షైన్ టైమ్ చాకో, దేవదత్ నాగే, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు.