Robinhood | టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin), వెంకీ కుడుముల (Venky Kudumula) కాంబోలో వస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్ (Robinhood). భీష్మ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఇక విడుదల తేదీ దగ్గరపడటంతో వరుస అప్డేట్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీజర్‌ను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా ఫస్ట్ సింగిల్‌ను వదిలింది.
ఈ మూవీ నుంచి వన్ మోర్ టైం అంటూ సాగే పాటను విడుదల చేసింది. ‘లుక్కిస్తే చాలు లక్కీగా ఫీల్ అవుతాను.. వన్ మోర్ టైం..’ ఫుల్ స్టైలిష్ గా సాగింది ఈ పాట. ఇక ఈ పాటకు జీవి ప్రకాశ్ సంగీతం అందించగా.. కృష్ణకాంత్ లిరిక్స్.. జీవి ప్రకాశ్, విద్య వోక్స్ కలిసి పాడారు. నితిన్ ఇందులో రాబిన్ హుడ్ అనే దొంగ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.