‘చలో’తో తొలి హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల.. ‘భీష్మ’ సినిమా విజయంతో ద్వితీయ విఘ్నాన్ని కూడా అధిగమించేశాడు. రాబోతున్న ‘రాబిన్ హుడ్’ విజయాన్ని సాధిస్తే, హ్యాట్రిక్ దర్శకుడిగా అవతరిస్తారాయన. నితిన్, శ్రీలీల జంటగా మైత్రీమూవీమేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు వెంకీ కుడుముల.