ఆర్కేసాగర్ నటించిన ‘ది 100’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన థాంక్స్‌మీట్‌లో హీరో ఆర్కే సాగర్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను పోషించిన విక్రాంత్ ఐపీఎస్ క్యారెక్టర్ అందరికి గుర్తుండిపోతుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ తన మ్యూజిక్‌తో సినిమాను మరోస్థాయికి తీసకెళ్లారు.
అన్ని కేంద్రాల నుంచి సినిమాకు మంచి స్పందన లభిస్తున్నది. ఈ సినిమా విషయంలో మా అంచనాలన్నీ నిజమయ్యాయి’ అన్నారు. సమాజంలో సమస్యల్ని తీసుకొని ఈ సినిమా చేశానని, ప్రేక్షకుల్లో స్ఫూర్తినింపుతున్నదని దర్శకుడు అన్నారు.