Rk Sagar | ఆ సినిమా నన్ను చాలా నిరాశపరిచింది.. ప్రభాస్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’పై RK సాగర్ అసంతృప్తి!
Rk Sagar Mr Perfect | ప్రభాస్ హీరోగా నటించిన 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమా తనకు నిరాశ కలిగించిందని నటుడు ఆర్.కె. సాగర్ తాజాగా వెల్లడించారు. ఈ చిత్రంలో తాను నటించినందుకు పశ్చాత్తాపడుతున్నానని ఆయన స్పష్టం చేశారు.
Mogali Rekulu Actor | ప్రభాస్ హీరోగా నటించిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా తనకు నిరాశ కలిగించిందని నటుడు ఆర్.కె. సాగర్ తాజాగా వెల్లడించారు. ఈ చిత్రంలో తాను నటించినందుకు పశ్చాత్తాపడుతున్నానని ఆయన స్పష్టం చేశారు. సాగర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ది100. ఈ చిత్రం జూలై 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గోన్న సాగర్ తనకు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు.
‘మొగలిరేకులు’ సీరియల్‌తో ఆర్.కె. నాయుడుగా నాకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ప్రభాస్ ‘మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నాకు ఛాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా కోసం నన్ను సంప్రదించినప్పుడు, ప్రభాస్ స్నేహితుడిగా, శివాజీ అనే పేరుతో రెండవ కథానాయకుడి పాత్ర అని చెప్పారు. కానీ నేను షూటింగ్‌కు వెళ్ళిన తర్వాత, నాకు చెప్పినదానికి పూర్తి భిన్నంగా ఉంది. నా పాత్రను చాలా తక్కువగా చూపించారు, జనాలకు గుర్తుపట్టలేనంతగా నా సన్నివేశాలు ఉన్నాయి. ఇది నాకు చాలా చెడు అనుభవాన్ని మిగిల్చింది.. నా లైఫ్‌లో చాలా రిగ్రేట్ అయిన మూవీ అంటూ సాగర్ చెప్పుకోచ్చాడు. దిల్ రాజు నిర్మాణంలో, దశరథ్ దర్శకత్వంలో 2011లో విడుదలైన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
“Mr. Perfect was a disappointing experience for me. When they approached me, they told me I was the second lead.
But once I went to the shoot, everything was completely different from what I was told. I honestly regret doing that film,” said actor RK Sagar. pic.twitter.com/Cy9gsdmIbI
— Movies4u Official (@Movies4u_Officl) July 8, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

