Sri Krishnadevaraya Biopic | కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిషబ్‌శెట్టి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తున్నాడు. ఇప్పటికే కాంతార ప్రీక్వెల్‌ను తెరకెక్కిస్తున్న రిషబ్ మరోవైపు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ పాత్రలో రాబోతున్న ఒక సినిమాలో నటించబోతున్నాడు. అయితే ఈ రెండు ప్రాజెక్ట్‌లే కాకుండా మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను రిషబ్ శెట్టి చేయబోతున్నట్లు తెలుస్తుంది.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్‌తో కలిసి రిషబ్ ఒక భారీ చారిత్రక చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆంధ్ర భోజుడు, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. కాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. “పానిపట్”, “జోధా అక్బర్”, “మొహెంజోదారో”, “లగాన్” వంటి హిస్టారికల్ చిత్రాలను తెరకెక్కించిన అశుతోష్ గోవారికర్ శ్రీకృష్ణదేవరాయలు బయోపిక్ తీస్తున్నట్లు వార్తలు వస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.