NTR – Trivikram | యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టాండర్డ్, ఆయన ఫాలోయింగ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆయన సినిమాలంటేనే బాక్సాఫీస్ దగ్గర ప్రత్యేక వైబ్రేషన్స్ మొదలైపోతాయి. రీసెంట్గా విడుదలైన ‘దేవర’ తో కెరియర్లోనే భారీ హిట్ అందుకున్న ఎన్టీఆర్, పాన్ ఇండియా లెవల్లో ఏకంగా ₹500 కోట్లకి పైగా వసూళ్ళు రాబట్టి తన మాస్ స్టామినాను మరోసారి నిరూపించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్.. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ ఇంటర్నేషనల్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
అయితే ఈ ప్రాజెక్ట్ తర్వాత ఎన్టీఆర్–త్రివిక్రమ్ కాంబోలో ఓ పాన్ ఇండియా సినిమా రానున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియన్ మైథాలజీలోని ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని నిర్మాత నాగ వంశీ ముందుగానే చెప్పటం హైప్‌ను మరింత పెంచింది.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీపై మరింత మైప్ క్రియేట్ చేసే వార్త ఒకటి బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న టాక్ ప్రకారం.. త్రివిక్రమ్ ఈ సినిమాలో మరో స్టార్ హీరోకు కూడా కీలక పాత్ర ఇవ్వాలని యోచిస్తున్నాడు. ఆ క్యారెక్టర్ స్క్రీన్ టైమ్ తక్కువైనా, కథలో చాలా ప్రాముఖ్యత ఉండబోతుందట. ఆ పాత్ర కోసం కన్నడ స్టార్ రిషబ్ శెట్టిను అప్రోచ్ అవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘కాంతార’ సక్సెస్‌తో రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే.అలాగే ఎన్టీఆర్–రిషబ్‌ల మధ్య మంచి బాండింగ్ కూడా ఉండటం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ఈ రూమర్స్ వైరల్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్ సినిమా అంటే ఆయన్నే చూడటానికి వస్తాం…అలాంటి సినిమాలో మరో స్టార్ హీరో ఎందుకు?” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ సినిమా అంటే ప్యూర్ సింగిల్ హీరో ఎంటర్టైనర్గా ఉండాలని, మరో స్టార్ హీరో ఉంటే ఫోకస్ డైల్యూట్ అవుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్–త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందనున్న సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇచ్చినా అది నెట్టింట తెగ వైరల్ అవుతుంది.