‘కాంతార’ ఫ్రాంఛైజీతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్‌శెట్టి. స్వీయ దర్శకత్వంలో ఆయన నటించిన ‘కాంతార: చాప్టర్1’ చిత్రం దేశవ్యాప్తంగా 800కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతున్నది. ఈ నేపథ్యంలో రిషబ్‌శెట్టి నటించే తాజా సినిమాల అప్డేట్స్పై అందరిలో ఆసక్తి నెలకొంది.
‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’లో రిషబ్‌శెట్టి కథానాయకుడిగా నటించబోతున్న విషయం తెలిసిందే. జనవరిలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఇదిలావుండగా.. రిషబ్‌శెట్టి మరో తెలుగు సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని, పీరియాడిక్ కథాంశమిదని, దీనికి ‘ఆకాశవాణి’ ఫేమ్ అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించే అవకాశముందని ఫిల్మ్‌నగర్ టాక్.