Rishab Shetty | డివైన్ స్టార్ రిషబ్ శెట్టి, ప్రగతి శెట్టిల ప్రేమకు జనవరి 23తో పదేళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని రిషబ్ శెట్టి ఎంతో సింపుల్‌గా, సైలెంట్‌గా జరుపుకున్నారు. భార్య ప్రగతితో కలిసి ఇంట్లోనే చిన్న కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను రిషబ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేయగా, అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలతో కామెంట్ల వర్షం కురిపించారు.ఈ సందర్భంగా రిషబ్ శెట్టి ఎంతో భావోద్వేగంగా స్పందించారు. “సినిమానే నా జీవిత భాగస్వామి అనుకున్న నాకు, నా మొదటి సినిమా షోలోనే నా నిజమైన జీవిత భాగస్వామి కలవడం జీవితంలో జరిగిన అందమైన అద్భుతాల్లో ఒకటి” అంటూ ప్రగతిపై తన ప్రేమను వ్యక్తం చేశారు.
అలాగే, “నీతో గడిపిన ప్రతి క్షణం ఒక అందమైన చిత్రకథలా అనిపిస్తుంది. ప్రేమలో పడి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ బంధం జీవితాంతం కొనసాగాలి” అంటూ మరో పోస్ట్ చేశారు. ఈ మాటలు అభిమానులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. పదేళ్ల ప్రేమ, వివాహ బంధంతో సంతోషంగా జీవిస్తున్న రిషబ్ శెట్టి, ప్రగతి శెట్టిలకు రణ్విత్, రాధ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబంతో కలిసి గడుపుతున్న ఈ మధుర క్షణాలను కూడా రిషబ్ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. జనవరి 23న షేర్ చేసిన ఓ వీడియోలో “నా కోసం నిలిచిన ప్రేమకు దశాబ్ద కాలం” అంటూ క్యాప్షన్ ఇవ్వడం మరోసారి అందరి మనసులు గెలుచుకుంది.
సినిమాల విషయానికి వస్తే, ‘కాంతార’తో దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న రిషబ్ శెట్టి, ‘కాంతార చాప్టర్-1’ తర్వాత ఇప్పటివరకు కొత్త దర్శకత్వ ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. ప్రస్తుతం ఆయన నటనపై పూర్తి దృష్టి పెట్టి, ‘జై హనుమాన్’, ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ వంటి భారీ సినిమాల్లో నటిస్తున్నారు. ఒకవైపు కెరీర్లో బిజీగా ఉంటూనే, మరోవైపు కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తూ పదేళ్ల ప్రేమ బంధాన్ని ఇలాగే నిలబెట్టుకుంటున్న రిషబ్ శెట్టి నిజ జీవితంలోనూ అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.