‘కాంతార చాప్టర్-1’ భారతీయ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తున్నది. విడుదలైన 9రోజుల్లోనే ఈ చిత్రం 500కోట్ల వసూళ్ల మైలురాయిని చేరుకుంది. దీంతో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. ఇదే స్థాయిలో థియేట్రికల్ రన్ కొనసాగితే ఈ సినిమా 800కోట్ల మార్క్‌ను కూడా దాటే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సినిమా వసూళ్లను వెల్లడిస్తూ శుక్రవారం చిత్రబృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది రోజుల్లో 509కోట్లు సాధించినట్లు వెల్లడించింది. రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘కాంతార చాప్టర్-1’ ఈ దసరా రోజున ప్రేక్షకుల ముందుకొచ్చింది. దక్షిణాది భాషలతో పాటు ఉత్తరాదిన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతున్నది.