‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’. ఆశ్వత్ మారిముత్తు దర్శకుడు. ఈ సినిమా నుంచి ‘రైజ్ ఆఫ్ ది డ్రాగన్’ అనే పాటను శుక్రవారం విడుదల చేశారు. లియోన్ జేమ్స్ స్వరపరచిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. ఇందులో ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ స్టెప్పులేశారు. ‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. వినోదంతో పాటు చక్కటి భావోద్వేగాలతో సాగుతుంది. అంతర్లీనంగా సందేశం ఉంటుంది. ‘లవ్‌టుడే’ తరహాలోనే యువతను మెప్పిస్తుంది’ అని మేకర్స్ తెలిపారు. అనుపమ పరమేశ్వరన్, కె.ఎస్.రవికుమార్, మిస్కిన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్నది.