సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత నిత్యం హెడ్ లైన్స్‌లో నిలిచిన భామ రియా చక్రవర్తి. తెలుగు, హిందీ భాషలలో నటించిన రియా చక్రవర్తికి గత కొన్ని నెలలు చాలా కష్టంగా గడిచాయి. బాలీవుడ్ డ్రగ్ వ్యవహరంలో రియా చక్రవర్తిని కోర్టు ప్రధాన నిందితురాలిగా తేల్చడంతో సుమారు నెల రోజుల జైలు జీవితాన్ని గడిపింది.అనంతరం బెయిల్‌పై విడుదలైంది.
ఇప్పుడు సినిమా ఆఫర్స్ కోసం ప్రయత్నిస్తున్న రియాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. వారంకు రూ.30 లక్షలకు పైగా పారితోషికం ను ఇచ్చే విధంగా కూడా నిర్వాహకులు ఆమెను ఒప్పించేలా ప్రయత్నించారట. కాని ఆమె మాత్రం హీరోయిన్ గా మళ్లీ సినిమాల్లో నటించాలని భావిస్తుంది కాని బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వాలని అనుకోవడం లేదట.
బిగ్ బాస్ అంటే కాంట్రవర్సీ. ఈ షోలో పాల్గొంటే తనపై మరింత నెగెటివిటీ పెరగుతుందేమోనని భయపడుతుందట. అయితే నిర్వాహకులు సీజన్ 15లో కుదరకపోయిన సీజన్ 16లో అయిన రియాని ఒప్పించి బిగ్ బాస్ హౌజ్‌లోకి తీసుకురావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారట. హిందీ బిగ్ బాస్ కు అత్యధిక రేటింగ్ వస్తోంది. సల్మాన్ ఖాన్ వంద కోట్లకు పైగా పారితోషికాన్ని తీసుకుంటున్న నేపథ్యంలో హిందీ బిగ్ బాస్ ఎంత విజయాన్ని దక్కించుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.