Health tips | మీరు రోజూ ఈ గింజలు తింటే కొవ్వు ఐస్‌లా కరిగిపోతుందట..!
Health tips | ఈ మధ్య కాలంలో చాలామంది హై కొలెస్ట్రాల్ (High Collesterol) సమస్యను ఎదుర్కొంటున్నారు. చాలామంది రక్తంలో కొవ్వు సమస్యతో బాధపడుతున్నారు. మారిన జీవన విధానం (Life Style), ఆహారపు అలవాట్లే ఇందుకు కారణమని ఆరోగ్య నిపుణులు (Health Experts) చెబుతున్నారు.
Health tips : ఈ మధ్య కాలంలో చాలామంది హై కొలెస్ట్రాల్ (High Collesterol) సమస్యను ఎదుర్కొంటున్నారు. చాలామంది రక్తంలో కొవ్వు సమస్యతో బాధపడుతున్నారు. మారిన జీవన విధానం (Life Style), ఆహారపు అలవాట్లే ఇందుకు కారణమని ఆరోగ్య నిపుణులు (Health Experts) చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బుల (Heart Deseases) బారినపడే ప్రమాదం ఉంది. కొలెస్టరాల్ తగ్గడానికి కొన్ని రకాల గింజలు మేలు చేస్తాయి. వాటిలో ఫైబర్‌తోపాటు మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆ గింజలను ఆహారంగా తీసుకోవడంవల్ల కొవ్వు సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. మరి ఆ గింజలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
అవిసె గింజలు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటినే లీన్ సీడ్స్ అని కూడా అంటారు. ఈ గింజల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి తోడ్పడుతాయి. కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించడంలో చియా విత్తనాలు కూడా దోహదపడతాయి. వీటిలో కూడా ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి దోహదపడతాయి.
రక్తంలో కొవ్వు సమస్యతో బాధపడేవారు పొద్దుతిరుగుడు గింజలను తీసుకోవడంవల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో విటమిన్ ‘ఇ’ తోపాటు మోనో శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి సాయపడుతాయి. నల్ల నువ్వులను తీసుకోవడం వల్ల కూడా చెడు కొవ్వు తగ్గుతుంది. వీటితో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది.
అదేవిధంగా జనపనార విత్తనాలను తీసుకోవడంవల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ప్రోటీన్‌తోపాటు గామా లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. కొలెస్టరాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి చక్కగా పనిచేస్తాయి. గుమ్మడి గింజలు కూడా కొవ్వును తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. ఈ గింజలల్లో ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్, మోనో శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. నువ్వులకు కూడా కొవ్వును తగ్గించే గుణం ఉంది. వీటిలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కడుపులో మంటను తగ్గించడంలో, కొవ్వును కరిగించడంలో ఇవి సాయపడతాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

