Retro | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తున్న ప్రాజెక్ట్ రెట్రో (Retro: Love Laughter War). సూర్య 44 (Suriya 44)గా వస్తోన్న ఈ మూవీకి కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శకత్వం వహిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఇంప్రెస్ చేయలేకపోయింది. రెట్రో ఇక డిజిటల్ ప్లాట్‌ఫాంలో తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అయింది.
ఈ మూవీ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో మే 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రెట్రో తెలుగు, తమిళంతోపాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో సందడి చేయనుంది రెట్రో. థియాట్రికల్ రిలీజైన నెల వ్యవధిలో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం మరి ఎలాంటి స్పందన రాబట్టుకుందనేది చూడాలి.
ఈ చిత్రంలో పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్ కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. సూర్య హోం బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్పై నిర్మించిన ఈ మూవీకి తిరు, 24, పేటా ఫేం సినిమాటోగ్రఫర్ డీవోపీగా వర్క్ చేశాడు.
Anbaana makkaley… The One… is… coming!🔥🔱
Watch #Retro, out 31 May on @NetflixIndia in Tamil, Hindi, Telugu, Malayalam and Kannada! #RetroOnNetflix@Suriya_Offl #Jyotika @karthiksubbaraj @hegdepooja @Music_Santhosh @prakashraaj @C_I_N_E_M_A_A @rajsekarpandian… pic.twitter.com/Gi1HcPwfLc
— 2D Entertainment (@2D_ENTPVTLTD) May 26, 2025