మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. కొద్ది రోజులులగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. సాయి తేజ్ ఆరోగ్యంకు సంబంధించిన అప్డేట్ ఇస్తూ రిపబ్లిక్ ట్రైలర్ విడుదల చేశారు.
సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2021
Launching the trailer :https://t.co/mdA3ILcZld@IamSaiDharamTej
సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష అంటూ రిపబ్లిక్ ట్రైలర్ ని తన ట్విట్టర్ లో విడుదల చేశారు రిపబ్లిక్ చిత్ర ట్రైలర్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. సాయిధరమ్ తేజ్ , దేవకట్టా కాంబినేషన్ లో వస్తోన్న పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’చిత్రంలో ఓ పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ విశాఖ వాణిగా రమ్యకృష్ణ నటించింది. జగపతి బాబు మరో ప్రధాన పాత్ర పోషించారు. ఐశ్వర్యా రాజేష్ కథానాయికగా నటించారు.