Renu Desai | టాలీవుడ్ నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన అనంతరం తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. ఇక చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ సోషల్ మీడియాలో తన అభిరుచులను పంచుకుంటుంది. అయితే ఈ భామ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టిన పవన్ అభిమానులు కామెంట్లు పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నా పర్సనల్ లైఫ్‌లోకి పవన్ కళ్యాణ్‌ను తీసుకురాకండి అని రేణు దేశాయ్ ఎన్ని సార్లు వేడుకున్న పవన్ అభిమానులు మాత్రం రేణు ఎలాంటి పోస్ట్ పెట్టిన ఆ పోస్ట్ కింద కామెంట్స్ పెడుతునే ఉన్నారు. ఇప్పటికే చాలా సార్లు వారికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇదిలావుంటే తాజాగా మరోసారి తన బాధను పంచుకుంది రేణుక.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తన భార్య లెజినోవాతో పాటు, పిల్లలు అకీరానందన్, ఆద్యతో సరదగా ఒక ఫొటో దిగగా ఈ ఫొటో వైరల్ అయింది. అయితే ఈ ఫొటోను ఉపయోగించి కొందరు మీమర్స్ రేణుదేశాయ్‌ను అవమానించేలా మీమ్స్ రూపొందించారు. తాజాగా వీటిపై ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
రేణు స్పందిస్తూ.. కొందరిని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఈ ఫొటోను నేను ఎలా క్రాప్ చేసి పోస్ట్ చేస్తానని ఆవేదన వ్యక్తం చేసింది. మీకూ ఒక ఫ్యామిలీ ఉందని గుర్తుంచుకొండి. తన తల్లిని ఎగతాళి చేస్తున్న పోస్టులను చూసి నా కూతురు విపరీతంగా ఏడ్చింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కుటుంబ సభ్యులపై కామెంట్స్ చేసే ముందు మీకూ ఇంట్లో తల్లి, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారని గుర్తుంచుకోండి. ఇలాంటి వ్యక్తులను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఇలాంటి మీమ్ పేజీలు నిర్వహించేవారు భయంకరమైన వ్యక్తులు. ఈ రోజు నా కుమార్తె ఎంతో బాధ అనుభవించింది. ఆమె కన్నీళ్లు కర్మ రూపంలో మిమ్మల్ని వెంటాడుతాయి. పొలినా, మార్క్(లెజినోవా పిల్లలు) సైతం ఇలాంటి విచక్షణ లేని కామెంట్లు, మీమ్స్‌తో ప్రభావితం అవుతారు. ఈ పోస్టు చేయడానికి వందలసార్లు ఆలోచించాను. నా కుమార్తె కోసం, ఆమె అనుభవించిన బాధను దృష్టిలో పెట్టుకుని ఈ పోస్టు చేస్తున్నాను అంటూ రేణు రాసుకోచ్చింది.