రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకుడు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత. దసరా కానుకగా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సినిమాలో రేణూ దేశాయ్ కీలక పాత్రను పోషిస్తున్నది. సమాజంలోని దురాచారాలపై ప్రజలను చైతన్యవంతులను చేసిన హేమలత లవణం పాత్రలో ఆమె కనిపించనుంది.
ఆదివారం రేణూ దేశాయ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె ఓ పసిబిడ్డను పట్టుకొని కనిపిస్తున్నది. ‘కథాగమనంలో రేణూ దేశాయ్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. సమాజంలో పరివర్తన కాంక్షించే మహిళగా ఆమె పాత్ర స్ఫూర్తివంతంగా సాగుతుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.మది, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, రచన-దర్శకత్వం: వంశీ.