Renu Desai | రేణు దేశాయ్ వార్నింగ్ ..సోషల్ మీడియాలో బూతులు పెడితే అరెస్ట్ ఖాయం!
Renu Desai | సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్, అసభ్యకర వ్యాఖ్యలపై నటి రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు. అకారణంగా బూతులు తిట్టే నెటిజన్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేస్తూ, చట్టపరమైన చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించారు. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో పలువురిని అరెస్ట్ చేయించిన ఆమె, తాజాగా మరోసారి వీడియో ద్వారా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు.
Renu Desai | సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్, అసభ్యకర వ్యాఖ్యలపై నటి రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు. అకారణంగా బూతులు తిట్టే నెటిజన్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేస్తూ, చట్టపరమైన చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించారు. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో పలువురిని అరెస్ట్ చేయించిన ఆమె, తాజాగా మరోసారి వీడియో ద్వారా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు.గతంలోనే సోషల్ మీడియా వేదికగా హెచ్చరించిన రేణూ దేశాయ్, చెప్పినట్లుగానే చర్యలకు దిగారు. తనపై దూషణలు చేసిన పలువురు నెటిజన్లపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇప్పటికే ఆరుగురికి పైగా వ్యక్తులను అరెస్ట్ చేశారు. “ఇక ఇది మొదట మాత్రమే.. ఇక్కడితో ఆగదు” అంటూ ఆమె స్పష్టం చేశారు.
పోలీసుల విచారణలో బయటపడిన విషయాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కొందరు కేవలం సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ఉద్దేశంతోనే సెలబ్రిటీలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారని సమాచారం. దీనిపై స్పందించిన రేణు దేశాయ్, తాత్కాలిక ఫేమ్ కోసం జీవితాంతం మచ్చ తెచ్చుకోవద్దు అంటూ హెచ్చరించారు. అసభ్యకరంగా ప్రవర్తించే వారి వివరాలను బయటపెట్టకపోయినా, వారి ఉద్యోగ స్థలాలకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తామని రేణు దేశాయ్ హెచ్చరించారు. “ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే బూతులు తిట్టడం కాదు. ఇలాంటి చర్యలు మీ కెరీర్ను నాశనం చేస్తాయి” అని స్పష్టం చేశారు.
ఈ కేసులో వేగంగా స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులను రేణు దేశాయ్ అభినందించారు. “సిస్టమ్ మీద మళ్లీ నమ్మకం పెరిగింది” అని తెలిపారు. ఇకపై ఎవరైనా ఇలాంటి దూషణలకు పాల్పడితే తప్పకుండా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కామెంట్స్ చేసే ముందు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలోచించాలని రేణు దేశాయ్ కోరారు. నచ్చని విషయాన్ని కూడా మర్యాదపూర్వకంగా చెప్పవచ్చని, కానీ అసభ్యకర వ్యాఖ్యలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆమె తేల్చి చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

