Renu Desai | టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన అనంతరం తనకంటూ మల్టీ టాలెంటెడ్ పర్సన్ సేవా ధృక్పథం ఉన్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లతో తన అభిరుచులను పంచుకుంటుంది. తాజాగా తన ఇంట్లో చండీ హోమం నిర్వహించినట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది.
శరద్ పూర్ణిమ సందర్భంగా భక్తి శ్రద్ధలతో చండీ హోమం పూజ చేయగా.. ఈ పూజా కార్యక్రమంలో రేణూ దేశాయ్‌తో పాటు ఆమె తనయుడు అకీరా నందన్ కూడా పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తాజాగా ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. సంస్కృతి గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందని రేణూ పేర్కొన్నారు. కాగా ఈ వీడియోను మీరు చూసేయండి.