సల్మాన్ ఖాన్ (Salman Khan), షారుక్‌ఖాన్ (Shahrukh Khan)..బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోల్లో టాప్ ప్లేస్ లో ఉంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండియావైడ్గానే కాదు ప్రపంచవ్యాప్తంగా వీరిద్దరికి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఈ ఇద్దరు సినిమాల్లోనే కాదు..ఈవెంట్స్ లో కూడా స్టేజ్ పై తమ పర్ ఫార్మెన్స్ తో అదరగొడతారు. సినిమాలకు అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకోవడంలోనే కాదు..ప్రైవేట్ ఈవెంట్స్ కు భారీ మొత్తంలోనే అందుకుంటారు. ఇంతకీ ఈ విషయం తెరపైకి రావడానికి ఓ కారణముంది.
కొన్ని వారాల క్రితం ఢిల్లీలో జరిగిన ఓ ప్రైవేట్ వెడ్డింగ్ ఈవెంట్లో డ్యాన్స్ చేసేందుకు సల్మాన్ ఖాన్, షారుక్ తీసుకున్న పారితోషికం ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. షారుక్ ఖాన్ రూ.3 కోట్లు, సల్మాన్ ఖాన్ రూ.2 కోట్లు వెడ్డింగ్ ఈవెంట్ పర్ ఫార్మెన్స్ కోసం తీసుకున్నారన్న వార్త ఇపుడు బీటౌన్‌గా హాట్ టాపిక్ అయిపోయింది. అంతేకాదు మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా రూ.2 కోట్లు తీసుకోగా..రన్ వీర్ సింగ్, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ ఒక్కో కోటి తీసుకున్నారట.
మొత్తానికి సినిమాలకే కాదు..ఇలా వెడ్డింగ్ ఈవెంట్స్ కు కూడా ఎవరూ ఊహించనంత ఛార్జ్ చేస్తూ వార్తల్లో నిలుస్తుండటంతో..స్టార్ హీరోల క్రేజ్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు.