న్యూఢిల్లీ : సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూబాయి కతియావాడి’ చిత్రం విడుదలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పటికే సినిమాను ఈ నెల 25న విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించగా.. సినిమా విడుదలపై స్టే విధించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు పిటిషన్‌పై విచారించిన.. జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరి ధర్మాసనం సినిమా విడుదలకు అనుమతి ఇచ్చింది. గంగూబాయి కతియావాడి చిత్రం టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పేరు మార్చాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. దీనికి నిర్మాత సినిమా విడుదల చివరి క్షణంలో పేరు మార్చడం కుదరదని పేర్కొన్నారు. అయితే, బుధవారం జరిగిన విచారణలో సంజయ్ లీలా భన్సాలీకి చిత్రం పేరు మార్చాలని సుప్రీం కోర్టు సూచించింది.
గంగుబాయి దత్తపుత్రుడిగా చెప్పుకుంటున్న పిటిషనర్ బాబూజీ రావ్జీ షా దాఖలు చేసిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టి వేసింది. రచయిత ఎస్ హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్ ఆఫ్ ముంబై’ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే, తన తల్లిని మాఫియా క్వీన్‌గా, అభ్యంతరకరంగా చిత్రంలో, పుస్తకంలో చిత్రీకరించారని ఆరోపించారు. అయితే, పిటిషనర్ సినిమాని చూడకుండా ఎలా ఆరోపణలు చేస్తారని భన్సాలీ ప్రొడక్షన్ లార్ సుందరం వాదించారు. సినిమాలో గంగూబాయి ఇమేజ్‌కు ఎలాంటి అవమానం కలుగలేదన్నారు. సినిమా పేరు మార్చడం ఆచరణాత్మకంగా సాధ్యం కాదని, సినిమా పేరు మారుపై వాదిస్తూ సినిమా పేరు మార్చడం కుదరని భన్సాలీ ప్రొడక్షన్ సుప్రీం కోర్టు తెలిపింది. చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్నది. అలియాభట్ గంగూబాయి పాత్రను పోషించగా.. అజయ్ దేవగన్, విజయ్ రాజ్, సీమా పహ్వా కీలకపాత్రలు పోషించారు.