న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ హేమామాలి(Hema Malini)ని 75వ బర్త్‌డే చాలా గ్రాండ్‌గా జరిగింది. ముంబైలో జరిగిన ఆ ఈవెంట్‌కు ఫిల్మ్‌స్టార్స్ హాజరయ్యారు. డ్రీమ్ గర్ల్ బర్త్‌డే సందర్భంగా ఆ నాటి మేటి నటి రేఖా కూడా ఆ ఈవెంట్‌కు వచ్చింది. హేమామాలిని, రేఖా .. ఇద్దరూ తమ బ్యూటీ గెటప్‌తో ఆకట్టుకున్నారు. తళతళ మెరిసే సారీలో ఆ ఇద్దరూ ఓ సాంగ్‌పై లైట్‌గా స్టెప్పులు కూడా వేశారు. క్యా ఖూబ్ లగ్తీ హో అన్న పాటకు ఇద్దరూ కొన్ని మూవ్స్ ఇచ్చారు. నటి రేఖ ఆ సాంగ్‌పై చిన్న చిన్న స్టెప్స్ వేయగా.. ఇక హేమా మాలిని ఆ సిచువేషన్ను ఎంజాయ్ చేసింది. హేమా మాలిని బుగ్గలను గిచ్చుతూ రేఖా తన ప్రేమను ఒలకబోసింది.
#Rekha with #HemaMalini at her birthday celebration.
Video Courtesy- @bhawanasomaaya pic.twitter.com/5mSaNXl1un
— Bollywoodirect (@Bollywoodirect) October 16, 2023