బాలీవుడ్ సీనియర్ నటి రేఖ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద నటించిన ‘ఇక్కిస్’ (Ikkis) సినిమా ప్రీమియర్ షోలో భాగంగా ఆమె చేసిన ఒక పని నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ‘ఇక్కిస్’ (Ikkis) న్యూ ఇయర్ కానుకగా జనవరి 01న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌కు రేఖ హాజరయ్యారు. అక్కడ రెడ్ కార్పెట్ వద్ద అగస్త్య నంద ఉన్న ఒక భారీ పోస్టర్‌ను చూసి ఆమె ఎమోషనల్ అయ్యింది. దీంతో వెంటనే ఆ పోస్టర్ దగ్గరికి వెళ్లి అగస్త్య ముఖంపై చేయి వేసి నిమురుతూ ప్రేమతో ‘ఫ్లైయింగ్ కిస్’ ఇచ్చి తన ఆశీస్సులు అందించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
అగస్త్య పోస్టర్‌ను చూసినప్పుడు రేఖ కళ్లజోడు పెట్టుకున్నప్పటికీ, ఆమె భావోద్వేగానికి లోనైనట్లు స్పష్టంగా కనిపించింది. అంతకుముందు ఆమె దివంగత నటుడు ధర్మేంద్ర పోస్టర్ వద్ద కూడా ఆగి, చేతులు జోడించి నమస్కరించారు. అమితాబ్ బచ్చన్‌తో రేఖకు ఉన్న పాత అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. అందుకే ఆమె ఆయన మనవడిపై ఇంతలా ప్రేమ కురిపించడం చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రపంచం అంతా మారిపోవచ్చు కానీ, రేఖ ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ చిత్రంలో దివంగత నటుడు ధర్మేంద్ర కీలక పాత్రలో నటించాడు.
The world might end but Rekha will never move on 🤭 pic.twitter.com/FEkAAr51eQ
— Mona Shandilya (@RoseTint4) December 29, 2025