Regina Movie Release Date | పద్దెనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘కుమార్ వర్సెస్ కుమారి’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది తమిళ బ్యూటీ సునయన. ఈ తర్వాత ‘సమ్ థింగ్ స్పెషల్’, ‘టెన్త్ క్లాస్’ ఇలా తెలుగులోనే తొలి మూడు సినిమాలు చేసింది. ఆ తర్వాత తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెగ బిజీగా గడపుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘రెజీనా’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సంచలనం సృష్టించాయి. రివేంజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు డామిన్ డీ సెల్వా దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను చిత్రబృందం ప్రకటించింది.
ఈ సినిమాను జూన్ 23న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఓ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కు వారం ముందు ఆదిపురుష్ విడుదల కాబోతుంది. ఆదిపురుష్ కు మంచి టాక్ వస్తే దాని ఎఫెక్ట్ కనీసం మూడు వారాలైన ఉంటుంది. కాగా ఈ లెక్కన చూసుకుంటే రెజీనా సినిమా గట్టి పోటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనంత్ నాగ్, నివాస్ ఆదితన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఎల్లో బేర్ బ్యానర్ పై సతీష్ నిర్మించాడు. అంతేకాకుండా సతీష్ ఈ సినిమాకు స్వయంగా సంగీతం కూడా అందించాడు.
\