ఎవరు సినిమా తర్వాత టాలీవుడ్ (Tollywood) భామ రెజీనా కసాండ్రా (Regina Cassandra) తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న చిత్రం నేనే నా (Nene Naa). నిను వీడని నీడను నేనే ఫేం కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్ పై రాజశేఖర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ చిత్రం ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది రెజీనా టీం.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన లుక్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. కళ్లద్దాలు పెట్టుకున్న రెజీనా మానవ అస్థిపంజరాన్ని పరీక్షించడం లేటెస్ట్ లుక్ లో చూడొచ్చు. ఈ మూవీలో రెజీనా ఫోరెన్సిక్ సైంటిస్టుగా కనిపించనుంది. నేనే నా థ్రియాట్రికల్ ట్రైలర్ ను త్వరలోనే విడదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. హార్రర్ మిస్టరీగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు శ్యామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్టర్. కాగా గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రఫీ.
రెజీనా మరోవైపు ‘శాకిని ఢాకిని’ చిత్రంలో కూడా నటిస్తోంది. నివేదా థామస్ ఈ సినిమాలో మరో లీడ్ రోల్ చేస్తోంది. కొరియన్ మూవీ ‘మిడ్ నైట్ రన్నర్స్’కి రీమేక్‌గా యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కష్టతరమైన యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంది రెజీనా. దీంతోపాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్యలో స్పెషల్ సాంగ్ చేస్తోంది రెజీనా.
The search begins to solve the mystery!#NeNeNaa featuring @ReginaCassandra, @vennelakishore & @iAksharaGowda
— BA Raju's Team (@baraju_SuperHit) August 18, 2021
Post production is in Final stage.
Trailer releasing soon
📝&🎬 by @caarthickraju
🎶@SamCSmusic
🎥@gokulbenoy
✂@EditorSabu
💵 #RajShekarVarma @AppleTreeOffl pic.twitter.com/IwtLBVRb4F
ఇవికూడా చదవండి..
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Vaishnav Tej | క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!