God father |చిరంజీవిని సంపత్ నంది కలవడానికి అసలు కారణం అదేనా..?
God father | చిరంజీవిని దర్శకుడు సంపత్ నంది కలవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సంపత్ నందితో చిరు సినిమా చేయబోతున్నాడా అని ప్రచారం మొదలైంది.

God father | మెగాస్టార్ చిరంజీవిని ఇటీవల దర్శకుడు సంపత్ నంది కలవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి.. సంపత్ నందితో కూడా సినిమా చేయబోతున్నాడా అని ప్రచారం మొదలైంది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికైతే ఎలాంటి సినిమా రావడం లేదు. కానీ వీరి భేటీ వెనుక మాత్రం వేరే కారణం ఉందని తెలుస్తోంది.
మెగా కుటుంబానికి అత్యంత చేరువగా ఉండే దర్శకుల్లో సంపత్ నంది ఒకడు. ఏమైంది ఈవేళ లాంటి సినిమా చేసిన తర్వాత అతడిని నమ్మి రామ్ చరణ్ రచ్చ సినిమా ఇచ్చాడు. అతడి నమ్మకాన్ని నిలబెట్టుకుని కమర్షియల్ హిట్ కూడా ఇచ్చాడు ఈ దర్శకుడు. అప్పటి నుంచి మెగా కుటుంబంతో ఈయన మంచి ర్యాపో మెయింటైన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవిని సంపత్ నంది ప్రత్యేకంగా కలిశాడు. అతడి ఇంటికి వెళ్లి మరీ కాసేపు ముచ్చటించి వచ్చాడు. చిరంజీవి, సంపత్ నంది కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. ఈ హడావిడి అంతా చూసి సంపత్, చిరు కాంబినేషన్లో సినిమా వస్తుందేమో అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే అందులో ఏ మాత్రం నిజం లేదు. కాకపోతే చిరును సంపత్ నంది కలవడం వెనక ఓ కారణం ఉంది. చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కింగ్ మేకర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే దాంతో పాటు మరో టైటిల్ కూడా ఈ మధ్యే ప్రచారంలోకి వచ్చింది.
అదే గాడ్ ఫాదర్.. ఈ టైటిల్‌నే పెట్టాలని ఫిక్స్ అయిపోయారు దర్శక నిర్మాతలు. ఇక్కడే చిన్న చిక్కొచ్చి పడింది. గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఆల్రెడీ మరో దర్శకుడు రిజిస్టర్ చేయించుకున్నాడు. ఆ చేయించుకున్నది ఎవరబ్బా అని ఆరా తీస్తే అది సంపత్ నంది అని తేలింది. దాంతో చిరు స్వయంగా సంపత్ నందిని అడగడంతో ఏ మాత్రం ఆలోచించకుండా ఈ టైటిల్ త్యాగం చేశాడు. చిరంజీవి అడిగిందే తడువుగా తాను రిజిస్టర్ చేసుకున్న టైటిల్‌ను ఇచ్చేశాడు. ఈ కారణంతోనే ఇంటికి వచ్చి మరీ చిరును కలిసినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు టైటిల్ ఇచ్చాడు.. త్వరలోనే కథ కూడా ఇచ్చి సినిమా చేస్తాడేమో చూడాలిక. అన్నట్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశాన్ని కొద్దిలో మిస్సయ్యాడు సంపత్ . గబ్బర్ సింగ్ 2 ఈయన దర్శకత్వంలోనే మొదలు పెట్టి ఆపేసాడు పవర్ స్టార్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రోడ్డుపై స్నానం చేసి షాకిచ్చిన బాలీవుడ్ నటుడు
కీర్తి సురేష్ ఏంటి హీరోలకు చెల్లెలుగా నటిస్తుంది
చిన్మయిని రేప్ చేసి చంపేస్తామంటూ బెదిరింపులు
‘మా’లో లొల్లి.. కుర్చీ దిగకూడదని నరేశ్ ప్రయత్నాలు: నటి హేమ
ఆ హీరోయిన్‌కి ఎందుకంత పొగరు అంటూ ట్రోలింగ్
అటు సినిమాలు.. ఇటు వెబ్ సిరీస్‌ల్లోనూ హీరోయిన్ల హవా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

