Srinu Vaitla | నకిలీ పత్రాలతో నమ్మించి బురిడీ.. రియల్ ఎస్టేట్ ముఠా చేతిలో మోసపోయిన దర్శకుడు శ్రీనువైట్ల
Srinu Vaitla | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల రియల్ ఎస్టేట్ మాయాజాలంలో చిక్కుకుని భారీగా నష్టపోయినట్లు తెలుస్తుంది.
Real Estate Scam | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల రియల్ ఎస్టేట్ ముఠా చేతిలో చిక్కుకుని భారీగా నష్టపోయినట్లు తెలుస్తుంది. వికారాబాద్ జిల్లా కడ్మూర్ ప్రాంతంలో లాభదాయకమైన భూమి ఉందంటూ నమ్మబలికిన ఒక కేటుగాళ్ల ముఠా, ఆయనతో పాటు ఆయన మేనకోడలు శ్వేతను దారుణంగా వంచించారు. 2019లో మొదలైన ఈ వ్యవహారంలో, నిందితులు అత్యంత పక్కాగా ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి, ఆ భూమి తమదేనని నమ్మించి వారిని బురిడీ కొట్టించారు. ఆ పత్రాలు అసలైనవేనని భావించిన శ్రీనువైట్ల, సదరు ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఏకంగా రూ.కోటి భారీ మొత్తాన్ని చెల్లించినట్లు తెలుస్తుంది. అయితే రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత తీరా ఆరా తీయగా, తాము కొనుగోలు చేసిన భూమికి, అమ్మిన వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదని, నకిలీ పత్రాలతో తమను మోసం చేశారని ఆయన ఆలస్యంగా గుర్తించారు. పక్కా పథకం ప్రకారం జరిగిన ఈ కుట్రపై శ్రీనువైట్ల హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ భారీ స్కామ్ వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకునేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

