RC 15: గ్రాండ్‌గా లాంచ్ అయిన రామ్ చరణ్-శంకర్ మూవీ.. గెస్ట్లుగా చిరు,రాజమౌళి,రణ్వీర్

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇన్నేళ్లు బిజీగా ఉన్న రామ్ చరణ్ రీసెంట్గా చిత్ర షూటింగ్ పూర్తి చేశాడు.ఇక ఇప్పుడు దర్శక దగ్గజం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా సినిమా కోసం పని చేయనున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన లాంచింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి,దర్శక ధీరుడు రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఈ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిరంజీవి క్లాప్ కొట్టగా, రాజమౌళి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. చిత్ర బృందం అంతా కలిసి ఫొటోలు దిగగా ఆ పిక్స్ వైరల్‌గా మారాయి. మరి కొద్ది రోజులలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది.
అంతకముందు సినిమా టీం పోస్టర్ విడుదల చేయగా, అందులో సినిమా టీమ్ అంతా బ్లాక్ సూట్లు ధరించి చేతిలో ఫైల్స్ , బ్యాగ్‌లతో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్లో సినిమాలో నటించే నటీనటులతోపాటు దర్శకుడు శంకర్ అలాగే నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ అంజలి, సునీల్, జై రామ్ కనిపించారు. ఈ చిత్రం రామ్ చరణ్‌కి 15వ మూవీ కాగా, ఇందులో చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుంది. ఇది దిల్ రాజు బ్యానర్‌కు 50 సినిమా కావడం విశేషం. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది.


Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kiara
- ram charan
- RC 15
- shankar
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

