RC 17 | మళ్లీ సందడికి సిద్ధమైన సుకుమార్-రామ్ చరణ్ కాంబో.. ప్రాజెక్ట్ సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్లనుంది అంటే..!
RC 17 | రామ్ చరణ్-సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం టాలీవుడ్లో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత అదే జోడీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు సుకుమార్, స్టార్ హీరో రామ్ చరణ్ కలిసి ఆర్సీ17(వర్కింగ్ టైటిల్) పేరుతో కొత్త సినిమాను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై నెల నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం.
RC 17 | రామ్ చరణ్-సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం టాలీవుడ్లో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత అదే జోడీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు సుకుమార్, స్టార్ హీరో రామ్ చరణ్ కలిసి ఆర్సీ17(వర్కింగ్ టైటిల్) పేరుతో కొత్త సినిమాను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై నెల నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. సుకుమార్ కథా పనులను పూర్తిచేసి, ప్రస్తుతం చివరి మెరుగులు దిద్దుతున్నారని తెలుస్తోంది. రంగస్థలం తరహాలోనే గ్రామీణ నేపథ్యంలో, భావోద్వేగాలు మరియు మాస్ అంశాలతో ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందించనున్నారు.
గతంలో వచ్చిన రంగస్థలం చిత్రం వసూళ్ల పరంగా మాత్రమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అందుకే ఇప్పుడు ఈ కొత్త సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరోవైపు, రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రీడా నేపథ్యంలో సాగే యాక్షన్ కథాచిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చరణ్ ‘పెద్ది పెహిల్వాన్’ పాత్రలో కనిపించనుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని ఏ.ఆర్. రెహమాన్ అందిస్తున్నారు.
ఇలా వరుస సినిమాలతో రామ్ చరణ్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రామ్ చరణ్ నుండి మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పెద్ది చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. 1980ల నాటి ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 4న విడుదలకి సిద్ధమైంది. ఈ సినిమాలో చరణ్ ‘పెద్ది పెహిల్వాన్’ పాత్రలో కనిపిస్తుండగా, జాన్వీ కపూర్ ‘అచ్చియమ్మ’గా నటిస్తోంది. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు వంటి భారీ తారాగణం ఉన్న ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా,ఇందులోని ‘చికిరి చికిరి’, ‘రైరై రారా’ పాటలు సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

