Srikanth Odela – Nani | స్టార్ కథానాయకుడు నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise). తనకి దసరా లాంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)తో ఈ సినిమా చేయబోతుండగా.. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.
తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు శ్రీకాంత్. ఈ మూవీ నుంచి రా స్టేట్మెంట్ (The Paradise Raw statement ) మార్చి 03న రాబోతుందంటూ ఈగల్ ఫొటోను పంచుకున్నాడు. ఈ మూవీ 1960 బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ మూవీని ఎనిమిది భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మూవీ గ్లింప్స్‌ని కూడా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, కన్నడ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
Raw statement from #TheParadise 🐦⬛🐦⬛
March 3rd pic.twitter.com/qWQDI8cLHN— Srikanth Odela (@odela_srikanth) March 1, 2025