Dhamaka Movie | దీపావళి రేసు నుండి రవితేజ తప్పుకున్నాడా?
Dhamaka Movie Release Date | మాస్‌రాజా రవితేజ ఫలితంతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. చాలా కాలం తర్వాత ‘క్రాక్’తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు రవితేజ. పాండమిక్‌లో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్ళను రాబట్టి బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది.
Dhamaka Movie Release Date | మాస్‌రాజా రవితేజ ఫలితంతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. చాలా కాలం తర్వాత ‘క్రాక్’తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు రవితేజ. పాండమిక్‌లో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్ళను రాబట్టి బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. ఇక అదే స్పీడ్‌లో ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలను 5నెలల గ్యాప్‌లోనే విడుదల చేశాడు. అయితే ఈ రెండు సినిమా ఫలితాలు రవితేజను తీవ్రంగా నిరాశపరిచాయి. ప్రస్తుతం ఈయన ఆశలన్ని ‘ధమాకా’ సినిమాపైనే ఉన్నాయి. ‘నేను లోకల్’ త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ల పనులను జరుపకుంటుంది. కాగా ఈ సినిమా విడుదల విషయంలో మాత్రం మేకర్స్ ఎలాంటి అప్డేట్లు ఇవ్వడంలేదు. ముందునుండి ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ వేశారు. కానీ, రిలీజ్ డేట్‌పై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం.. అవి కాస్త ఫ్లాప్‌లుగా మారడంతో ఈ సినిమాపై ఎలాంటి బజ్ లేదు. ఈ క్రమంలో చిత్రబృందం భారీగా ప్రమోషన్లను జరిపి సినిమాపై మంచి బజ్ తీసుకురావాలని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే దీపావళి రేసు నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
Read Also:
Gopichandh | ఆ ఫ్లాప్ దర్శకుడికి గోపిచంద్ చాన్స్ ఇచ్చాడా?
Oke Oka Jeevitham | ఓటీటీలోకి శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
God Father | ‘గాడ్ ఫాదర్’లో చిరంజీవి పాత్ర అంతసేపు ఉండనుందా?
Ponniyin Selvan | ‘200 కోట్ల’ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ‘పొన్నియన్ సెల్వన్’..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

