Oke Oka Jeevitham | ఓటీటీలోకి శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Oke Oka Jeevitham On OTT | చాలా కాలం తర్వాత శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. ‘మహానుభావుడు’ తర్వాత వరుస బ్యాక్ టు బ్యాక్ ఫేయిల్యూర్స్తో నిరాశలో ఉన్న శర్వాకు ఈ చిత్రం మంచి బ్రేక్ ఇచ్చింది.
Oke Oka Jeevitham On OTT | చాలా కాలం తర్వాత శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. ‘మహానుభావుడు’ తర్వాత వరుస బ్యాక్ టు బ్యాక్ ఫేయిల్యూర్స్తో నిరాశలో ఉన్న శర్వాకు ఈ చిత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. శ్రీకార్తిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు నుండి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ చిత్రానికి ఓపెనింగ్స్ భారీ రేంజ్లో రాకపోయినా రోజు రోజుకు ప్రేక్షకుల్లో సినిమాపై ఆధరణ పెరుగుతుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో అక్కినేని అమల కీలకపాత్ర పోషించింది. కాగా ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్ర హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ దక్కించుకుంది. ఇక ఈ సినిమాను అక్టోబర్ 10నుండి డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో శర్వాకు జోడీగా రీతూ వర్మ హీరోయిన్గా నటించింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు. రూ.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫైనల్‌గా రూ.11 కోట్ల వరకు షేర్‌ను సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

