Gopichandh | ఆ ఫ్లాప్ దర్శకుడికి గోపిచంద్ చాన్స్ ఇచ్చాడా?
Gopichandh Next Movie | యాక్షన్ హీరో గోపిచంద్ చాలా కాలం తర్వాత 'సీటిమార్'తో హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. అయితే ఈ చిత్రం కమర్షియల్‌గా భారీ విజయం సాధించలేకపోయింది. ఈ క్రమంలో పక్కా కమర్షియల్ వంటి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందకు వచ్చాడు.
Gopichandh Next Movie | యాక్షన్ హీరో గోపిచంద్ చాలా కాలం తర్వాత ‘సీటిమార్’తో హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. అయితే ఈ చిత్రం కమర్షియల్‌గా భారీ విజయం సాధించలేకపోయింది. ఈ క్రమంలో పక్కా కమర్షియల్ వంటి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందకు వచ్చాడు. అయితే ఈ చిత్రం కూడా గోపిచంద్‌కు కమర్షియల్ బ్రేక్ ఇవ్వలేదు. దాంతో గోపిచంద్ తీవ్రంగా నిరాశపడ్డాడు. ఈ సమయంలో గోపిచంద్‌కు సక్సెస్ చాలా అవసరం. ప్రస్తుతం ఈయన శ్రీవాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాలు బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. ఈ క్రమంలో వీరిద్దరూ ఎలాగైనా హ్యట్రిక్ సాధించాలని కసితో ఉన్నారు.
ఇదిలా ఉంటే గోపిచంద్ తాజాగా శ్రీనువైట్లతో సినిమా చేయడానికి సిద్ధమయినట్లు తెలుస్తుంది. ఇటీవలే శ్రీనువైట్ల ఓ యాక్షన్ థ్రిల్లర్ కథను గోపిచంద్‌కు చెప్పాడట. కథ నచ్చడంతో గోపిచంద్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక 2011లో వచ్చిన ‘దూకుడు’ తర్వాత ఇప్పటివరకు శ్రీను వైట్ల ఒక్క హిట్ సినిమా తీయలేదు. ఇటీవలే ఈయన మంచు విష్ణుతో ‘ఢీ-2’ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో గోపిచంద్.. శ్రీనువైట్లతో సినిమా చేస్తున్నాడటంటే రిస్క్ అనే చెప్పాలి అంటూ పలువురు నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Read Also:
God Father | ‘గాడ్ ఫాదర్’లో చిరంజీవి పాత్ర అంతసేపు ఉండనుందా?
Bimbisara Movie | ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బింబిసార’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
NTR30 | జూ.ఎన్టీఆర్‌కు జోడీగా ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లు?
God Father | ‘ఆచార్య’ ఫలితంతో భారీగా తగ్గిన ‘గాడ్‌ఫాదర్’ టిక్కెట్ ధరలు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

