Bimbisara Movie OTT date | ఈ ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రాలలో ‘బింబిసార’ ఒకటి. కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి మల్లడి వశిష్ఠ దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాల్లేకుండా ఆగస్టు 5న విడులైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన చిత్రంగా ‘బింబిసార’ నిలిచింది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ నటన వర్ణణాతీతం. డ్యూయల్ రోల్లో కళ్యాణ్‌రామ్ అద్భుతంగా నటించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా ఓటీటీ హక్కులను ‘జీ-5’ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. కాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 7నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌కు జోడీగా కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రానికి దాదాపు రూ.15 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్లో రూ.35.9 కోట్ల షేర్‌ను సాధించి డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతో టాలీవుడ్లో కళ్యాణ్‌రామ్ మార్కెట్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం ‘బింబిసార-2’ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. అన్ని కుదిరితే వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మూవీ సీక్వెల్ పట్టాలెక్కే అవకాశం ఉంది.