NTR30 | జూ.ఎన్టీఆర్‌కు జోడీగా ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లు?
NTR30 Heroine | 'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు జూ.ఎన్టీఆర్. ఈ చిత్రంలో కొమరం భీం పాత్రలో తారక్ నటనకు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. కేవలం ఇండియాలోనే కాకుండా గ్లోబల్‌గా తారక్ నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి.
NTR30 Heroine | ‘ఆర్ఆర్ఆర్’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు జూ.ఎన్టీఆర్. ఈ చిత్రంలో కొమరం భీం పాత్రలో తారక్ నటనకు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. కేవలం ఇండియాలోనే కాకుండా గ్లోబల్‌గా తారక్ నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ అదే జోష్‌తో కొరటాల శివతో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కసరత్తులు కూడా స్టార్ట్ చేశాడు. ఇక ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఫిలింగా తెరకెక్కనుంది. ఇప్పటికే విడుదలైన డైలాగ్ వీడియో సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తారక్‌కు జోడీగా ఎవరు నటిస్తున్నారు అనే ప్రశ్న ప్రేక్షకుల్లో చాలా రోజులుగా మెదులుతుంది.
టాలీవుడ్ వర్గాల సమచారం ప్రకారం ఈ చిత్రం కోసం ఇద్దరు హీరోయిన్లను మేకర్స్ అనుకుంటున్నారట. చివరిగా ఆ ఇద్దరిలో ఒకరిని ఫైనల్ చేస్తారట. ఆ హీరోయిన్లు ఎవరా? అనుకుంటున్నారా? వారిలో ఒకరు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, మరొకరు కీర్తి సురేష్. కాగా ఆ ఇద్దరిలో ఒకరిని తారక్‌కు జోడీగా ఎంపిక చేస్తారట. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్‌లో షూటింగ్ ప్రారంభించే అలోచనలో ఉందట. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్స్ట్, యువసుధ ఆర్స్ట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనుందట.
Read Also:
SSMB28 | మహేష్-త్రివిక్రమ్ సినిమాలో మలయాళ స్టార్ హీరో?
God Father Movie | ‘గాడ్‌ఫాదర్-2’ తెరకెక్కనుందా.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి
Dasara Movie | ఐదు భాషల్లో విడుదల కానున్న ‘దసరా’ ఫస్ట్ సింగిల్
Bimbisara Movie | ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బింబిసార’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

