God Father Movie | ‘గాడ్‌ఫాదర్-2’ తెరకెక్కనుందా.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి
God Father Movie Part-2 | రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ ఫుల్ జోష్‌తో సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ బిగెనింగ్‌లో చిరుకు ఎంతటి బిజీ షెడ్యూల్ ఉండేదో.. ఇప్పుడు కూడా అంతే బిజీతో వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం చిరు మంచి కంబ్యాక్ కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘గాడ్‌ఫాదర్’ వంటి పొలిటికల్ యాక్షన్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
God Father Movie Part-2 | రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ ఫుల్ జోష్‌తో సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ బిగెనింగ్‌లో చిరుకు ఎంతటి బిజీ షెడ్యూల్ ఉండేదో.. ఇప్పుడు కూడా అంతే బిజీతో వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం చిరు మంచి కంబ్యాక్ కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘గాడ్‌ఫాదర్’ వంటి పొలిటికల్ యాక్షన్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ నుండి ఇటీవలే విడుదలైన టీజర్ వరకు ప్రతీది సినిమాపై అంతకంతకు అంచనాలను పెంచుతూనే ఉన్నాయి. మొహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో అక్టోబర్ 5న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిరు ప్రమోషన్లను జోరుగా జరుపున్నాడు.
కాగా ప్రమోషన్లో భాగంగా సినిమాకు సంబంధించిన పలు విషయాలను పంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో జరిగిన ప్రెస్ మీట్లో గాడ్ ఫాదర్ సీక్వెల్ గురించి చెప్పాడు. గాడ్‌ఫాదర్ సీక్వెల్‌ను తెరకెక్కించడానికి చాలా అవకాశాలున్నాయిని తెలిపాడు. అయితే అవకాశాలున్నాయని చెప్పాడు కానీ, ఖచ్చితంగా సీక్వెల్‌ను రూపొందిస్తామని చెప్పలేదు. ఇక గాడ్‌ఫాదర్ రిజల్ట్‌ను బట్టి సీక్వెల్‌కు ప్లాన్ వేస్తారెమో చూడాలి.
ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయిన ‘లూసీఫర్’కు రీమేక్‌గా తెరకెక్కింది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సల్మాన్‌ఖాన్ అతిధి పాత్రలో నటించగా సత్యదేవ్, నయనతార కీలకపాత్రలు పోషించారు. ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు.
Read Also:
Bimbisara Movie | ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బింబిసార’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
SSMB28 | మహేష్-త్రివిక్రమ్ సినిమాలో మలయాళ స్టార్ హీరో?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

