God Father | ‘గాడ్ ఫాదర్’లో చిరంజీవి పాత్ర అంతసేపు ఉండనుందా?
God Father Movie | రీ ఎంట్రీ గ్రాండ్‌గా ఇచ్చిన మెగాస్టార్ అదే జోష్‌ను తర్వాత సినిమాల్లో కంటిన్యూ చేయలేకపోయాడు. 'ఖైదీ నం.150' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత 'సైరా', 'ఆచార్య' సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో చిరంజీవిని కాస్త నిరాశపరిచాయి.
God Father Movie | రీ ఎంట్రీ గ్రాండ్‌గా ఇచ్చిన మెగాస్టార్.. అదే జోష్‌ను తర్వాత సినిమాల్లో కంటిన్యూ చేయలేకపోయాడు. ‘ఖైదీ నం.150’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ‘సైరా’, ‘ఆచార్య’ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో చిరంజీవిని కాస్త నిరాశపరిచాయి. ప్రస్తుతం ఈయన ఆశలన్ని ‘గాడ్‌ఫాదర్’ చిత్రంపైనే ఉన్నాయి. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయిన ‘లూసిఫర్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది. యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. చిత్రబృందం తీరక లేకుండా వరుసగా ప్రమోషన్లను జరుపుతూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలను దర్శకుడు మొహన్‌రాజా ప్రేక్షకులకు వెల్లడించాడు. కాగా ఒరిజినల్ వెర్షన్లో మోహన్‌లాల్ పాత్ర నిడివి 50 నిమిషాలు ఉండగా.. గాడ్‌ఫాదర్‌లో చిరు పాత్ర రెండు గంటలు ఉండనుందట. అంతేకాకుండా కథలో కూడా చాలా మార్పులు చేశామని, మలయాళంలో చూడని పది పాత్రలు ఇందులో వేరే రూపంలో ఉంటాయని తెలిపాడు. ఇక చిరు అంతసేపు సినిమాలో ఉండునన్నట్లతో తెలియడంతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్లో నటించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి. నయనతార కీలకపాత్ర పోషించగా, టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. థమన్ సంగీతం అందించాడు.
Read Also:
Ponniyin Selvan | ‘200 కోట్ల’ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ‘పొన్నియన్ సెల్వన్’..!
Hunt Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న సుధీర్ బాబు ‘హంట్’ టీజర్
Balakrishna | బాలయ్య-బోయపాటి కాంబోలో నాలుగో సినిమా తెరకెక్కనుందా?
Oke Oka Jeevitham | ఓటీటీలోకి వచ్చేస్తున్న శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

