Raviteja – VV Vinkayak | టాలీవుడ్లో హీరో రవితేజ్- దర్శకుడు గోపిచంద్ మలినేనిలది క్రేజీ కాంబినేషన్లలో ఒకటి. వీళ్లిద్దరూ ఇప్పటికే మూడు సినిమాలు చేసి బాక్సాఫీస్ వద్ద హిట్లు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు నాలుగోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైయింది.
కాగా ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు రవితేజ. ఆరు నెలల్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువాలని టార్గెట్ పెట్టుకున్నారు. అటు దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా దానికి తగినట్లే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేయడం రవితేజకి అలావాటే. అలాగే ఒక సినిమా సెట్స్ కి వెళ్ళిన వెంటనే మరో సినిమాని కూడా రెడీ చేస్తుంటారాయన.
ఇప్పుడు కూడా రవితేజ లిస్టులో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరింది. రవితేజ, దర్శకుడు వివి వినాయక్లది క్రేజీ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘కృష్ణస మూవీ భారీ బ్లక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇదిలా ఉంటే..ఈ కాంబినేషన్ మళ్ళీ సెట్ కాబోతుంది. రవితేజని దృష్టిలో పెట్టుకొని మాస్ ఎలిమెంట్స్‌తో కథని రెడీ చేశారు వినాయక్. రవితేజకి కూడా కథ నచ్చింది. గోపీచంద్ మలినేని సినిమా పూర్తయిన వెంటనే వినాయక్ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు వున్నాయి. మరోవైపు రవితేజ ‘ఈగల్’ చిత్రం సంక్రాంతి విడుదల సిద్ధమౌతోంది.