Mass Jathara Teaser | మాస్ మహారాజ కథానాయకుడు రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర'(Mass Jathara). శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో రవితేజ రైల్వే పోలీస్‌గా కనిపించబోతున్నాడు. టీజర్లో ‘నాకంటూ ఓ చరిత్ర ఉంది..’ అంటూ మాస్ డైలాగ్‌తో అలరించాడు రవితేజ. ఇక ఈ సినిమాలో రైల్వే పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు ఈ మాస్ హీరో.