రవితేజ ఖిలాడీ మళ్లీ మొదలైంది.. జూలై 26 నుంచి శరవేగంగా షూటింగ్
ఖిలాడీ సినిమా షూటింగ్ జూలై 26 నుంచి మొదలు కానున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. నాన్ స్టాప్ షెడ్యూల్ తో సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు రమేష్ వర్మ. ఈ చిత్రం కోసం రవితేజ 10 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా ఫామ్‌లోకి రావడానికి ఒక్క హిట్ చాలు. ఆ ఒక్క విజయం వచ్చిందంటే.. ముందు వచ్చిన ఫ్లాపులు అన్నీ మరిచిపోతారు. ఇప్పుడు రవితేజ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఒకే ఒక్క సినిమాతో రవితేజ మార్కెట్ మళ్లీ రయ్యిమంటూ పైకి లేచింది. గతేడాది వరకు ఈయన సినిమాల రూ.20కోట్ల మార్క్ అందుకోవడానికి కూడా అష్టకష్టాలు పడ్డాయి. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా రూ.40 కోట్ల వచ్చేస్తున్నాయి. పాండమిక్ తర్వాత సంక్రాంతికి విడుదలైన క్రాక్ సినిమా కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో 38 కోట్ల షేర్ వసూలు చేసింది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. క్రాక్ తర్వాత రవితేజ మార్కెట్ ట్రాక్ ఎక్కింది.అందుకే రాబోయే సినిమాలకు సంబంధించిన బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది.
ప్రస్తుతం ఆయన రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమాలో రవితేజ నటిస్తున్నాడు.
ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చింది. మే 28న సినిమాను విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా వల్ల షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. ఇప్పటికే ఖిలాడీ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. దీంతో వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నాడు దర్శకుడు రమేశ్‌వర్మ. ఈ నేపథ్యంలో ఖిలాడీ సినిమా షూటింగ్ జూలై 26 నుంచి మొదలు కానున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. నాన్ స్టాప్ షెడ్యూల్ తో సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు రమేష్ వర్మ. ఈ చిత్రం కోసం రవితేజ 10 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ఓటీటీలో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. రవితేజ సినిమాలకు ఇప్పుడు సూపర్ హిట్ అయితే రూ.30 కోట్లు వస్తాయి. కానీ ఖిలాడి సినిమాకు ఏకంగా 40 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా హక్కుల కోసం అడుగుతున్నట్లు తెలుస్తోంది. 40 కాకపోతే 45 కోట్లు అయిన ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈ విషయంపై రవితేజ నిర్మాతలు మాత్రం ఇంకా ఏమీ మాట్లాడడం లేదు. ఈ సినిమాకు రూ.25 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు అమెజాన్ ఏకంగా 45 కోట్ల ఆఫర్ ఇచ్చింది. అయితే ఈ చిత్రాన్ని మాత్రం థియేటర్స్‌లోనే విడుదల చేస్తామని నిర్మాతలు తేల్చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
బ్రహ్మాజీతో జాగ్రత్తగా ఉండు.. నాగశౌర్యకు రానా సూచన
ఆర్య ఇంట డబుల్ ధమాకా.. తల్లి అయిన అఖిల్ హీరోయిన్.. విశాల్ ఎమోషనల్
RRR సినిమా విషయంలో వివాదాలు తప్పవా?
పవర్ స్టార్‌తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?
జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు వచ్చేసింది.. చరణ్ ఇంటి ముందు పార్కింగ్..!
త్రిష పెళ్లి టాపిక్ మళ్లీ వైరల్..ఇంతకీ ఎవరా వ్యక్తి.?
రాజ్ కుంద్ర సంస్థకు శిల్పాశెట్టి రాజీనామా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

