రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ధమాకా’. డబుల్ ఇంపాక్ట్ అనేది శీర్షిక. యువ తార శ్రీలీల నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రబృందం తాజాగా రొమాంటిక్ పాట చిత్రీకరణ కోసం స్పెయిన్ వెళ్లింది. అక్కడి ప్లాజా డి ఎస్పానా అనే ప్రాంతంలో పాటను రూపొందిస్తున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘ఇటీవలే హైదరాబాద్లో భారీ యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కించాం. తాజాగా పాటల చిత్రీకరణతో శరవేగంగా సినిమాను పూర్తి చేస్తున్నాం. స్పెయిన్ లోని చారిత్రక ప్రదేశాల్లో రూపకల్పన చేస్తున్న ఈ పాట సినిమాలో ప్రత్యేకంగా ఉంటుంది’ అన్నారు దర్శకుడు త్రినాథరావు నక్కిన. ఈ చిత్రానికి కథ, మాటలు : ప్రసన్న కుమార్, సంగీతం : భీమ్స్, సినిమాటోగ్రఫీ : కార్తీక్ ఘట్టమనేని.