Raviteja- Harish Shankar | ఫలితాలెలా ఉన్నా మాస్ రాజా మాత్రం బ్యాక్ టు బ్యాక్ కమిట్మెంట్లు ఇస్తున్నాడు. ఇప్పటికే రవన్న చేతిలో టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలున్నాయి. ఇవి రెండు పాన్ ఇండియా రేంజ్లో రూపొందుతున్నవే. ఇందులో ఒకటి దసరాకు విడుదల కానుండగా.. మరోటి సంక్రాంతి స్లాట్‌ను బుక్ చేసుకుంది. ఇవి పూర్తి కాగానే గోపిచంద్ మలినేనితో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక ఇదిలా ఉంటే రవితేజ మరో సినిమాను కూడా లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రవితేజ లైనప్‌లో హరీష్ శంకర్ ఉన్నాడట. షాక్ సినిమాతో హరీష్‌ను రవితేజనే ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇది అల్ట్రా డిజాస్టర్ అయింది. అయినా సరే హరీష్‌ను నమ్మి మిరపకాయ్ సినిమా చేశాడు. ఇది సెన్సేషనల్ హిట్టయింది. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్‌కు ఇండస్ట్రీలో మాములు డిమాండ్ ఏర్పడలేదు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లతో చెలరేగిపోయాడు. చేసింది కొన్ని సినిమలే అయినా.. కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా చేస్తున్నాడు.
ఇక ఇటీవలే రవితేజను కలిసి ఓ లైన్ చెప్పాడట. రవితేజకు ఆ లైన్ బాగా నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేయమని చెప్పినట్లు టాక్. ఉస్తాద్‌ను పూర్తి చేయగానే హరీష్ ఈ సినిమాను పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నాడు. ఎలాగో రవితేజకు కూడా ఇంకా చాలా సమయమే ఉంది. ఈ లోపు ఫుల్ స్క్రిప్ట్‌ను తీసుకెళ్లి ఇంప్రెస్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.